エピソード

  • ఛాయ - విదేశీ సిరీస్లో మొదటి నవల: 'బాబిగాడి వీరచరితం' మీద సంభాషణ
    2025/04/02

    ఛాయ - విదేశీ సిరీస్లో మొదటి నవల: 'బాబిగాడి వీరచరితం' మీద జరిగిన ఈ సంభాషణలో ఛాయ పబ్లికేషన్స్ సీఈఓ అరుణాంక్ లత, నెమ్మి నీలం అనువాదకులు అవినేని భాస్కర్ , పాఠకురాలు బాల, అనువాదకుడు కుమార్ పాల్గొన్నారు .

    పుస్తకం ప్రీ ఆర్డర్ ఛాయా వెబ్సైట్ లేదా అమెజాన్ ద్వారా చెయ్యొచ్చు . పుస్తకం ఈ నెల ముప్ఫయివ తేదీన మీ చేతికొస్తుంది .

    続きを読む 一部表示
    36 分
  • 'బాబిగాడి వీరచరితం' - రెండో అధ్యాయం!
    2025/03/29

    ఇన్నాళ్ళూ దేశీ అనువాదాలను తెలుగు పాఠకులకు చేరువ చేసిన @chaayabooks విదేశీ అనువాదాలూ తీసుకువాలని సంకల్పించింది. ఈ రెండేళ్ళలో 15 భాషల నుండి 25 పుస్తకాలు, అవీ సమకాలీన సాహిత్యమై ఉండాలనేది ఛాయ ప్రయత్నం. ఈ నవల ఆ ప్రయత్నంలో మొదటిది.

    వందకు పైగా పిల్లల నవలలు, టీన్ ఫిక్షన్ నవలలు రాసిన సుప్రసిద్ధ నార్వేజియన్ రచయిత ఆర్నీ స్వింజెన్ రాసిన ‘సాంజెన్ ఒమ్ ఎన్ బృకెట్ నెసె’ అనే ఈ నవల పదిహేను ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డులను గెల్చుకుంది.

    ‘ఛాయ విదేశీ’ సిరీస్‌‌లో మొదటి నవలగా ఈ ‘బాబిగాడి వీరచరితం’ను మీ ముందుంచుతున్నాం. కమింగ్ సూన్.

    続きを読む 一部表示
    23 分
  • 'అధోలోకం' అనువాదకులు భాస్కర్ అవినేని, కుమార్ లతో 'ఛాయ బుక్స్' అరుణాంక్ లత
    2025/03/19

    అధోలోకం అనువాదకులు భాస్కర్ అవినేని, కుమార్ లతో ఛాయ సీఈఓ, అరుణాంక్ లత జరిపిన సంభాషణ .

    కింది లింక్ ను ఉపయోగించి పుస్తకం కొనండి .

    https://chaayabooks.com/product/adholokam/

    続きを読む 一部表示
    59 分
  • బతుకు సేద్యం నవలాపరిచయం
    2024/12/22

    బతుకు సేద్యం - జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ సంఘటనలనాధారం చేసుకుని రాసిన కాల్పనిక నవల. ఎపిసోడ్ లో ముందుగా ఛాయా మోహన్ గారు మాట్లాడతారు. తర్వాత రచయిత శాంతి ప్రభోదిని గారు నవల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు.

    続きを読む 一部表示
    18 分
  • 'ఏర్పాట్లు ' - ఇందిరా పార్థసారథి
    2024/12/22

    తమిళ రచయిత ఇందిరా పార్థసారధి రాసిన ‘ఏర్పాట్లు’ అనే ఈ కథ ను తెలుగులోకి అనువదించింది జిల్లెళ్ళ బాలాజీ గారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘నీళ్ళ కోడి’ కథాసంకలనం లోనిది.

    ఇందిరా పార్థసారధి సుప్రసిద్ధ తమిళ రచయిత. తన రచనలకు, సరస్వతీ సమ్మాన్, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటి ఎన్నో పురస్కారాలను పొందారు.

    ‘నీళ్ళ కోడి’ కొనడానికి -

    https://amzn.to/44Jov9x

    続きを読む 一部表示
    13 分
  • 'ఒక వైపు సముద్రం' - నవలాపరిచయం
    2024/12/22

    కన్నడ రచయిత వివేక్ శానభాగ రాసిన " ఒందు బది కడలు" నవల, తెలుగు అనువాదంలోని కొన్ని భాగాలు మీరిప్పుడు వింటారు . ఈ నవలను 'ఒక వైపు సముద్రం' పేరుతో తెలుగులోకి రంగనాథ రామచంద్ర రావు గారు అనువదించారు. ఈ పుస్తకం అమెజాన్ లో ఛాయా రిసోర్సెస్ సెంటర్ ద్వారా లభ్యమౌతోంది.(https://bit.ly/okaviaipusamudram).


    నవల కొన్న మొదటి యాభై మంది పాఠకులకు, 'సంచారి బుర్రకథ ఈరమ్మ' పుస్తకం ఉచితంగా లభిస్తుంది.



    ఉత్తర కన్నడ జిల్లా తీర ప్రాంతంలో చాలా నదులొచ్చి సముద్రంలో కలుస్తాయి. ఎంతో అందం గా వుండే ఈ ప్రదేశంలో నివసించే మనుషుల జీవితాలూ, వస్తున్న మార్పులూ, మార్పుల వల్ల వచ్చే సంఘర్షణ, వీటిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్న, నవల 'ఒక వైపు సముద్రం'



    続きを読む 一部表示
    8 分
  • రామేశ్వరం కాకులు: కథ - ప్రతిస్పందన.
    2024/12/22

    ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘ రామేశ్వరం కాకులు’ పుస్తకం లోనిది.

    పుస్తకం కొనాలంటే – https://amzn.to/3rDN1YM

    続きを読む 一部表示
    37 分
  • 'సత్యలింగం' - పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా'91 సంపుటం నించి)
    2024/12/22

    సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా సత్యలింగం అత్యుత్తమైన కథ.

    కథలోకెడితే 'టీటీ' అని పిలవబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి. తన ఇంట్లో అద్దెకుండే కూర్మయ్య నాయుడి గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళూపైతెలీని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత నెలకొనేటందుకు, కాంతారావును సలహా అడుగుతాడు నాయుడు. రైల్లో ఎక్కడో చూచాయగా విన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని, నాయుడి మనసులో సత్యలింగాన్ని ప్రతిష్టిస్తాడు కాంతారావు. సత్యలింగం వల్ల కూర్మయ్య నాయుడు జీవితంలో ఏవి జరిగింది, అనేదే కథ. కూర్మయ్య నాయుడు ఎంత ఆసక్తికరమైన పాత్రో అంతకంటే కాంతారావు అంతర్మధనం , కూర్మయ్య నాయుడి పై అతనికి తెలీకుండా ఏర్పడే సానుభూతి, కాంతారావుని పాఠకుడి మనసుకి చాలా దగ్గరగా చేరుస్తాయి.

    కథ చివరికి వచ్చేటప్పటికి నమ్మకం, విశ్వాసం, ఆధ్యాత్మికత మనిషి కి ఇచ్చే ఆసరా, వీటన్నిటీ గురించి పాఠకుణ్ణి లోతుగా ఆలోచింపచేస్తుంది ‘సత్యలింగం’.

    గుప్తా'91 పుస్తకం కొనడానికి -

    http://bit.ly/3lGsrqd

    続きを読む 一部表示
    34 分