పల్నాటి వీరభారతం ఒక చారిత్రాత్మిక నవల.రచయిత: చిట్టిబాబుPalnati Veera Bharatam is a historical fiction written by Chittibabu.This is the podcast version of this wonderful historical fiction.*****చరిత్రలను వీరుల రక్తంతోను, వీరవనితల కన్నీటితోనూ కలగలిపి రాస్తేనేం…అది వీరభారతమైనప్పుడు! పల్నాటి పౌరుషం తెలుగువాణ్ణి, తెలుగునాణ్ణీ పునీతం చేసి, తరతరాల తెలుగు సంస్కృతిలో వెలలేని విలువైన మణిదీపమైనప్పుడు.నిజానికి పల్నాటి రాళ్ళలోనూ, రప్పల్లోనూ పౌరుష ముండి తీరాలి. నాగులేటి నీళ్ళల్లో, నాపరాళ్ళల్లో వీరత్వం కనిపించకపోతే శ్రీనాథ కవిసార్వభౌముడి కవితాకన్య మృదుమధుర ద్విపద కవితారాగాన్ని పల్కించి వుండకపోవచ్చు.ఐతే చరిత్ర చేసుకున్న మహాపాపమేమంటే; అది తన మహాప్రవాహంలో స్వచ్ఛమైన నీళ్ళతో పాటు చెత్తనీ, చెదారాన్నీ కలుపుకున్నది. కట్టుకథలు కావ్యాల్లో పుట్టిపెరిగి కొన్నిసార్లు రసాభాసగా తయారవుతాయి. అట్లాంటి కల్పితాలే లేకపోతే పల్నాటి చరిత్ర – వీరభారతమే.జాతిని ఉద్దీపింపజేసేదీ, క్షాళితమైన హిందూరక్తంలో పవిత్రతతో పాటు వీరత్వాన్ని కలగజేసేదీ ఇటువంటి చరిత్రలే.ఐతే పల్నాటి చరిత్రను ఎందుకు వ్రాయాల్సి వచ్చింది? *****పల్నాటి చరిత్రను పరిశీలించి చూస్తే ప్రతిపాత్రా సజీవ వీరరసోద్దీపనా చిహ్నమే. తల్చుకుంటే ఒళ్ళు జలదరించే సంఘటనా సంఘటితమే.బ్రహ్మన్నా, బాలచంద్రుడూ, కన్నమదాసూ, అలరాజూ, వీరభద్రుడు ఇత్యాదులు మహావీరులైతే, మాంచాలా, పేరిందేవి, నాగమ్మా వీరవనితలైన తెలుగువాళ్ళ ఆడపడుచులు.తెలుగునాట ఈ కథ మర్చిపోతే, తెలుగునోట ఈ కథ పలక్కపోతే – తెలుగులకు చరిత్రే లేదు. తెలుగులకు విలువే లేదు. ప్రతి జాతికీ ఒక వీరచరిత్ర కావాలి.మాంచాలవంటి వీరపత్నులు రక్తసిందూరంతో భర్తల్ని యుద్ధరంగానికి పంపారు. ఇట్లాంటి కొంతమంది ధర్మపత్నులు రాసుకున్న వీరపారాణే జాతికి వెన్నెముక, దన్ను.“నాయకీ నాగమ్మ – మగువ మాంచాల మా తోడబుట్టినవాళ్ళు!”“నాగమ్మ తలగొట్టి నలగాముబట్టి మనసీమలో శాంతి వెలయింపజేయగా దీవించిపంపవే దేవి మాంచాలా!” – అని విన్నప్పుడు జలదరించిన శరీరంతో – ఈ నవల వ్రాయాలనుకున్నాను.పారాణి పూసుకునే పవిత్రమైన పాదాలు కనిపించినప్పుడూ; పేరిందేవిలాంటి తెలుగు ఆడపడుచుల కన్నీటి కథల్లో కరిగిపోయినప్పుడూ – పల్నాటి నాగులేటి నీటిలో పారిన రక్తప్రవాహాల్తో ఈ తెలుగునేల తడిసి పునీతమై, గాలి – ...
続きを読む
一部表示