『తెలుగు భాషా దినోత్సవం』のカバーアート

తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషా దినోత్సవం

著者: SBS
無料で聴く

このコンテンツについて

తెలుగు రచయితల ఆలోచనాధారలో మార్పులు తెచ్చి సాహిత్య ప్రవాహాన్ని గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషకు మరల్చిన వ్యావహారిక భాషా పితామహుడు, అభినవ వాగమశాసనుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. 1919లో ‘తెలుగు’ అనే మాసపత్రికను స్థాపించి మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగతి సాధించాలంటే వాడుక భాషలో పాఠ్యగ్రంధాలుండాలని వ్యావహారిక భాషావాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే, భాషాభివృద్ధిని కొంతపుంతలు తొక్కించిన వ్యావహారిక భాషా కర్షకుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. వారి జన్మదినమైన ఆగష్టు 29వ తేదిని తెలుగు జాతి అంతా తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలుగ భాష ఔనిత్యాన్ని చాటే కార్యక్రమాలను ఈ నెలలో ప్రతి గురువారం SBS తెలుగు భాషాభిమానులకు, తెలుగు శ్రోతలకు అందించనుంది.Copyright 2025, Special Broadcasting Services 社会科学
エピソード
  • తెలుగు భాషా దినోత్సవం EP1: తెలుగు భాషా ప్రశస్తి
    2024/07/31
    ‘భాష’ అంటే భావాన్ని వ్యక్తం చేసేది. అలాంటి అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మ నీటిలో ఉన్ననాటిది. అది మన పుట్టకతో మొదలవుతుంది. మనం గిట్టినా అనంత విశ్వంలో విహరిస్తూనే ఉంటుంది.
    続きを読む 一部表示
    9 分
  • తెలుగు భాషా దినోత్సవం EP2: తెలుగు సాహిత్యానికి తలమానికం శతక సాహిత్యం
    2024/08/08
    శాఖోపశాఖాలుగా విస్తరించిన తెలుగు సాహితీ విపణిలో శతకపద్య ప్రక్రియ ఒకటి. 12వ శతాబ్ధంలో మొదలైన శతక సాహిత్య పరిమళాలు నేటి ఆధునిక కాలంలో కూడా గుభాళిస్తున్నాయి.
    続きを読む 一部表示
    15 分
  • తెలుగు భాషా దినోత్సవం EP3: తెలుగు సాహిత్యంలో జాతీయత.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు...
    2024/08/15
    సమాజంలోని మార్పులకు అనుగుణంగా కవులు స్పందించటం పరిపాటి. నాడు ఆంగ్లేయుల దాస్య శృంఖలాలు నుంచి విముక్తి పొందటానికి చేసిన పోరాటంలో అనేకమంది తెలుగువారు ప్రాణాలు అర్పించారు. తెలుగు కవులు కూడా తమ వంతుగా స్వాతంత్రోద్యమ భావనను రగిలించే రచనలు చేసి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించారు.
    続きを読む 一部表示
    17 分

తెలుగు భాషా దినోత్సవంに寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。